16, ఫిబ్రవరి 2011, బుధవారం

ప్రేమ... ప్రేమించు..... ప్రేమని పొందు.....

అమ్మ ప్రేమ తెలియకపోతే అసలు ప్రేమ అంటేనే నీకు అర్థం తెలియదు..
ప్రకృతిని ప్రేమించ లేకపోతే నువ్వు ప్రేమించానే లేవు.....
అమ్మని ప్రేమిస్తే అ ప్రేమ నిన్ను వెతుకుంటూ వస్తుంది.....
ప్రకృతిని ప్రేమిస్తే అ ప్రేమలో నువ్వు సేద తిరుతావు.........
ప్రేమని నమ్మితే అ నమ్మకం నీలో నిజం అవుతుంది...
అమ్మలో నిన్ను వెతుకుంటే ని జీవితం ఆనంద మాయం అవుతుంది....
ప్రకృతి లో అమ్మని వెతుకుంటే ని జీవితం రసమయం అవుతుంది.....
అమ్మ కి ప్రకృతి కి అర్థం తెలిస్తేనే జీవితానికో అర్థం వుంటుంది..........
ఇవి తెలియని వాడికి ప్రేమకి వాంఛ కి తేడ తెలియదు........
ప్రేమ అంటే తెలిసిన వాడికి ప్రేమించడానికి ప్రేమించ బడటానికి తేడ తెలుస్తుంది.........
అ తేడ తెలిసినవాడే జీవితాన్ని ప్రేమమయం చేసుకుంటాడు.......!

మనస్సులో ఎదురుచూపు........

నవరసాల్ని అనుభవించాను.........
షడ్రుచులని ఆస్వాదించాను........
నవ గ్రహాల్ని పుజించాను............
పంచభుతాలని ప్రార్దించాను........
దుఖాన్ని తట్టుకున్నాను............
సంతోషాలని పొందాను..............
కష్టాలకి ఎదురేల్లను.................
కానీ నిన్ను ప్రేమించే అవకాశాన్ని ఇంకా పొందలేకపోయాను.....
నిన్ను వెతికే నా మనస్సుని కట్టడి చెయ్యడం అంటే..........
అ ఓర్పుతో సునామీకి ఆనకట్ట కట్ట వచ్చేమో........
రాక్షసుడని రసికుడిగా మార్చ వచ్చేమో.........
ఎడారిలో వ్యవసాయం చెయ్య వచ్చేమో.............
సుర్యడ్ని చల్లగా చేయ్యోచేమో.........
ఎ వాణ్ణి చెయ్య లేనని తెలుసు.....
అందుకే నీ వెతుకుతూనే వుంటాను...........

విరహం..... వేదన.....

పువ్వుల అందాన్ని చూసినప్పుడు...................
పసి పాప బోసినవుల్ని చూసినప్పుడు...............
కొండల పై వచ్చిన ఇంద్రధనస్సుని చూసినప్పుడు....
తెల్లగా పరుచుకున్న పొగ మంచుని చూసి నప్పుడు..
వెలుగునిచ్చే ఉషోదయాన్ని చూసినప్పుడు...........
నిన్నే చూడాలని నాకు అనిపిస్తుందని నీకు ఎవరు చెప్తారు...!!
సూర్యాస్తమయం అయినప్పుడు నువ్వు ఇంకా ఈ రోజు కి రావని బాధ పడాలో లేక..
మరొక ఉదయం నాకోసం రాబోతోందని ఎదురు చూడాలో అర్థం కాలేదు.....
కానీ ఆ ఎదురుచూపులో ఎంతో బాధ వుంది అంటే
నువ్వు ఇంకా రావని తెలిసిన అంత బాధ పడనేమో....!