24, నవంబర్ 2012, శనివారం

నాలొ నూవ్వు....


నీ రుపం నాకు ఆహ్లదం...
నీ నవ్వు నాకు సంతొషం...
నీ బాధ నాకు నరకం...
నీ ద్వేషం నాకు శతృత్వం...
నీ మౌనం నాకు ప్రళయం...
నీ శాంతం నాకు ఊల్లాసం...
నీ మనస్సు నాకు దేవాలయం...
నీ తొ జివితం నాకు స్వర్గదాయం.. ..

నీతొ......


నీతొ గడపాలి- సమాయనికి చిరాకు వచ్చేవరకు...
నీతొ  మట్లాడాలి- బాషలన్నిటిలొ పదాలు నిండుకొవాలి...
నీతొ నడవాలి-దూరనికి విసుగు వచ్చెవరకు...
నీతొ నవ్వాలి- ఆనందానికి ఏడుపు వచ్చెవరకు...
నీతొ జివించాలి- స్వర్గానికే  అసుయవచ్చెవరకు...

నువ్వు .....


నీ తొడు గ్రీష్మంలొ నులివెచ్చని కమ్మదానానివి...
నీ నవ్వు ప్రకృతి  మాత సరిగమలు...
నీ చూపు కరిమబ్బుల నుండి చొచ్చుకువచ్చిన సుర్యకిరణం...
నీ స్వరం వసంతం లొ కొయిల గానం...
నీ స్పర్శ పసిబిడ్డ చెతిలొని అత్మీయత...
నీతొ ఏకాంతం నిండు వెన్నల్లొ సముద్రతీరాన వింద్యమరలు...
నీతొ జివితం నరకం లొ స్వర్గాప్రాయం...
నీ ప్రేమ మండె వెసవిలొ తొలకరి వానా...

నా లొకం లొ.....



నా లొకం లొ.....
ఆలొచన నువ్వు...
హౄదయ ప్రతిస్పందన  నువ్వు...
శాంతి వి నువ్వు...
ప్రశ్నే లేని జవాబువి నువ్వు...
పట్టరాని ఆనందం నువ్వు...
వర్ణించలెని అనుభూతివి నువ్వు...
మరిచిపొలెని కలవి నువ్వు...
కనులుముసిన కనపడె రుపం నువ్వు...
.....................................

20, నవంబర్ 2012, మంగళవారం

నీకు నేను.... మరి నాకు........!


నీ నవ్వుల ప్రపంచం లొ ఖైదిని నేను...

నీ మాటలొ భావాన్నీ నేను..
నీ చూపులొ దృశ్యన్నీ నేను...

నీ తలపుల చెరలొ బంధిని నేను....
నీ సంతొషపు జివితం లొ బానిసను నేను....
నీ జివితపు వెలుగులొ కాలె కట్టెను నేను....
నీ బాధల కాలానికి అంతం నేను....
నీ విజయం వైపికి ప్రయణం లొ దారిని నేను....  

నీ ప్రతీ క్షణములొ అరక్షణము నెనౌతా...
మరి....
నా ప్రతీ శ్వాసలొ ఊపిరివి నువ్వు అవుతావా..?