7, అక్టోబర్ 2011, శుక్రవారం

ఇంకా సుర్యొదయం కాని వెళా, క్రితం రాత్రి సముద్రంలొ సంబవించిన కల్లొలం తాలుకు విషదన్ని చుసి చెలించి పొయడు ఓడ్డునె ఉండె ఒక బాలుడు. మానవ ప్రయత్నంగా ఓడ్డుకు కొట్టుకు వచ్చిన తాబెలు పిల్లల్ని ఒక్కొక్కటిగా తిరిగి సముద్రం లొకి వదులుతున్నడు. బాలుడు చెస్తున్న ఈ పనిని చుసిన ఒక ముసలి వాడు, బాలుడ్ని అడిగాడు... ఇన్ని వేలా తాబెల్లు వున్నై ఇక్కడ నువ్వు తిరిగి పంపించె ఈ కొన్నింటి వలనా ఎమి తెడా వస్తుంధి? ఇక్కద వున్నా తాబెల్ల సంఖ్యలొ తెడా రాక పొవచ్చు... కాని నెను పంపించె ఒక్కొ తాబెలు తాప్పనిసరిగా సముద్రం లొ తెడా తిసుకువస్తుంది అని చెప్పాడు .
ఉపయొగ పడె ఏ చిన్నా పని అయిన దాని ఫలితం చాలా పెద్ద గా ఉంటుంది...

16, ఫిబ్రవరి 2011, బుధవారం

ప్రేమ... ప్రేమించు..... ప్రేమని పొందు.....

అమ్మ ప్రేమ తెలియకపోతే అసలు ప్రేమ అంటేనే నీకు అర్థం తెలియదు..
ప్రకృతిని ప్రేమించ లేకపోతే నువ్వు ప్రేమించానే లేవు.....
అమ్మని ప్రేమిస్తే అ ప్రేమ నిన్ను వెతుకుంటూ వస్తుంది.....
ప్రకృతిని ప్రేమిస్తే అ ప్రేమలో నువ్వు సేద తిరుతావు.........
ప్రేమని నమ్మితే అ నమ్మకం నీలో నిజం అవుతుంది...
అమ్మలో నిన్ను వెతుకుంటే ని జీవితం ఆనంద మాయం అవుతుంది....
ప్రకృతి లో అమ్మని వెతుకుంటే ని జీవితం రసమయం అవుతుంది.....
అమ్మ కి ప్రకృతి కి అర్థం తెలిస్తేనే జీవితానికో అర్థం వుంటుంది..........
ఇవి తెలియని వాడికి ప్రేమకి వాంఛ కి తేడ తెలియదు........
ప్రేమ అంటే తెలిసిన వాడికి ప్రేమించడానికి ప్రేమించ బడటానికి తేడ తెలుస్తుంది.........
అ తేడ తెలిసినవాడే జీవితాన్ని ప్రేమమయం చేసుకుంటాడు.......!

మనస్సులో ఎదురుచూపు........

నవరసాల్ని అనుభవించాను.........
షడ్రుచులని ఆస్వాదించాను........
నవ గ్రహాల్ని పుజించాను............
పంచభుతాలని ప్రార్దించాను........
దుఖాన్ని తట్టుకున్నాను............
సంతోషాలని పొందాను..............
కష్టాలకి ఎదురేల్లను.................
కానీ నిన్ను ప్రేమించే అవకాశాన్ని ఇంకా పొందలేకపోయాను.....
నిన్ను వెతికే నా మనస్సుని కట్టడి చెయ్యడం అంటే..........
అ ఓర్పుతో సునామీకి ఆనకట్ట కట్ట వచ్చేమో........
రాక్షసుడని రసికుడిగా మార్చ వచ్చేమో.........
ఎడారిలో వ్యవసాయం చెయ్య వచ్చేమో.............
సుర్యడ్ని చల్లగా చేయ్యోచేమో.........
ఎ వాణ్ణి చెయ్య లేనని తెలుసు.....
అందుకే నీ వెతుకుతూనే వుంటాను...........

విరహం..... వేదన.....

పువ్వుల అందాన్ని చూసినప్పుడు...................
పసి పాప బోసినవుల్ని చూసినప్పుడు...............
కొండల పై వచ్చిన ఇంద్రధనస్సుని చూసినప్పుడు....
తెల్లగా పరుచుకున్న పొగ మంచుని చూసి నప్పుడు..
వెలుగునిచ్చే ఉషోదయాన్ని చూసినప్పుడు...........
నిన్నే చూడాలని నాకు అనిపిస్తుందని నీకు ఎవరు చెప్తారు...!!
సూర్యాస్తమయం అయినప్పుడు నువ్వు ఇంకా ఈ రోజు కి రావని బాధ పడాలో లేక..
మరొక ఉదయం నాకోసం రాబోతోందని ఎదురు చూడాలో అర్థం కాలేదు.....
కానీ ఆ ఎదురుచూపులో ఎంతో బాధ వుంది అంటే
నువ్వు ఇంకా రావని తెలిసిన అంత బాధ పడనేమో....!

6, డిసెంబర్ 2010, సోమవారం

మంచు కురిసే వేళలో....

ఒక మహా కవి చెప్పాడు " మంచు కురిసే వేళలో .........................."
మరి నాకెందు కు చెలి పక్కనున్న వేళె మంచుకురిసేవేళ అవుతుంది...........!
నేను అయితే.......
ప్రేమ అనే మంచు తో తనని తడిపెస్తాను.......
ఆప్యాయత అనే కౌగిలితో తనకి వేడి పడతాను........
మాటలు అనే పంచామృతం తో తన కడుపు నింపుతాను.....
అభిమానం అనే ఒడి లో సేద తీరుస్తాను.........
మనుసు రధం పై విహారానికి తీసుకుని వెళతాను ..........
స్నేహం అనే అస్త్రం తో రక్షనిస్తాను.........
అనురాగం తో జీవితాన్ని ఇస్తాను........
అందుకే నువ్వు నా పక్కనే వుంటే వెన్నెల్లో మంచు కురుస్తుంది నాకు ఎప్పుడు .................!

1, డిసెంబర్ 2010, బుధవారం

నా ప్రేమ!

మండు వేసవిలో వున్నా న మిద పండు వెన్నల లా నువ్వు నువ్వు ప్రేమని కురుపిస్తే ......
అ ప్రేమని ఎలా కొలవగాలను!. షాజహాను ప్రేమకి తాజమహల్ కొలత అయితే న ప్రేమకి ఎన్ని తాజమహల్ కట్టించాలి.......
ఎడారి లాంటి నా మనుస్సులో ఒయాసిస్ లా ప్రేమని కురిపిస్తే అ ప్రేమని ఎలా మరచిపోగలను. సెయింట్ వాలెంటైన్ తన ప్రేమని మర్చిపోకుండా ఒక రోజుని తన ప్రేమగా ఇస్తే నేను ఎన్ని రోజులు న ప్రేమకి గుర్తుగా ఇవ్వాలి.................
నడి సముద్రం లో వున్నా నా మనస్సుకి తెరచాపల నీ ప్రేమ దారిచుపిస్తే అ ప్రేమికి నేను ఏమి ఇవ్వగలను.............
ఒక కోఇలల నేను నీ కోసం పడలేను, రవి వర్మ లా నీకోసం న ప్రేమ రూపాన్ని చిత్రించలేను... చలం ల న ప్రేమని అక్షరాల లోకి మరల్చలేను.... నీ ప్రేమ కు రూపాన్ని సమాధి ల నిర్మించాలేను...
కానీ సూర్య చంద్రులు వున్నన్ని రోజులు న మనస్సులో నీ ప్రేమ వుంటుంది......ఇది నీకు తెలియడానికి నీ తెలియడానికి నీకు కావలసింది కేవలం మనస్సు బాషను అర్థం చేసుకోవడమే................................!

25, నవంబర్ 2010, గురువారం

మనస్సు ..!!

మనస్సుకు బాష వుంటే ఆ బాష మనిషి అయితే ఆ మనిషి ఎంత అందంగా వుంటాడు అంటే........
మనస్సు జవాబు చేప్పగలిగేవాడు నిజంగా వుంటే వాడు వాడు దేవుడు అవుతాడు .....................
మరి అలా అయితే మనిషి కి మనస్సు కు తేడ వుందా?